మహానాయకుడు ట్రైలర్…అదరకొట్టారు !

NTRMahanayakudu Official Trailer

నందమూరి అభిమానులతో పాటు బాలకృష్ణ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్న సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ మధ్య కాలంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ గురించి ఆకట్టుకోవడంతో ఇప్పుడు బాలకృష్ణ పై ఒత్తిడి పెరిగి పోయింది. దానికితోడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో కచ్చితంగా ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఎదో ఒక మాయ చేసి ఎన్టీఆర్ మహానాయకుడు తో విజయం అందుకోవాలని చూస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. దానికి ఊతం ఇచ్చేలా ఇప్పుడు ట్రైలర్ ఇందాక విడుదలయిన ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. 1983లో ఆయన పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు కాంగ్రెస్ లో విభేదాలు, ఆయన జీవితంలో జరిగిన రాజకీయ సంక్షోభం ఇవన్నీ మహానాయకుడులో కనిపించబోతున్నాయి. ఎన్టీఆర్ కృష్ణుడి బొమ్మ చూసి ఆయనకు ఇందిరా గాంధీ దణ్ణం పెట్టడం లాంటి సీన్లు సినిమా మీద ఆసక్తిని రేపుతున్నాయి. చైతన్య రథయాత్ర సీన్లు, నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ కీలకంగా కనిపిస్తున్నాయ. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 22న మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. మీరు కూడా ట్రైలర్ మీద ఒక లుక్కేయండి.