ఐదు రోజుల పాటు రేప్….ఐదు నెలలకి ఆస్థిపంజరం !

Missing Teen Girl Was Gang-Raped For 5 Days And Murdered In Chennai

ఐదు నెలల క్రితం ఒక 15 ఏళ్ల అమ్మాయి కనిపించకుండా పోయింది. అయితే తన ప్రియుడితో కలిసి పారిపోయిందని అంతా అనుకున్నారు. పోలీసులు కూడా ఈ కారణంగానే కేసును క్లోజ్ చేశారు. అయితే తాజాగా ఒక చెరుకు పొలంలో మనిషి అస్థిపంజరం దొరకడంతో ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో దర్యాప్తు చేస్తే తేలింది ఏంటంటే, ఏ మాత్రం చెప్పలేని ఘోరం. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లబోయిన ఆ అమ్మాయిని శంకరయ్య అనే వ్యక్తి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళాడు. ఎందుకంటే ఆమె తన ప్రేమను కాదన్నది అనే కోపంతో. ఒక మామిడి తోటలో ఆమె మీద అత్యాచారం జరిపాడు శంకరయ్య, ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న ఆ తోట యజమానులు విషయాన్ని బయట పెట్టాల్సింది పోయి వారు కూడా ఆమె మీద లైంగిక దాడి చేశారు. మొత్తం ఐదు రోజుల పాటు ఆమె మీద అత్యాచారం చేసారు ఐదుగురు వ్యక్తులు. కిరాతకంగా ఆమెపై లైంగిక దాడి చేశారు. ఐదు రోజుల తరువాత ఆ అమ్మాయిని వదిలిపెట్టాలని మొదట భావించారు. అయితే ఆమె ఎక్కడ నిజం బయటపెడుతుందో అనే అనుమానంతో మనసు మార్చుకున్న దుండగులు బలమైన వస్తువుతో ఆ అమ్మాయిని హత్య చేశారు. అనంతరం ఓ కాలువ గట్టున ఆమె శవాన్ని పూడ్చిపెట్టారు. కొద్ది రోజుల క్రితం అమ్మాయి అస్థిపంజరం నీళ్లలో కొట్టుకురావడం దానిపై పోలీసులు విచారణ జరపడంతో ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులను వారికి సహకరించిన వ్యవసాయ క్షేత్రం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమిళనాడులోని తిరుత్తని పట్టణం సమీపంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది.