లక్ష్మీ స్ వీరగ్రంధం టీజర్ రిలీజ్…!

Laxmi's Ntr Veera Grandham Movie Teaser

టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ లను పోటాపోటీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ ‘ఎన్టీఆర్ బయోపిక్’ కి పోటీగా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తుంటే.. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ గుడిలో లింగాన్ని ఎత్తుకెళ్లాడు అంటూ ఇటీవల నాదెండ్ల భాస్కరరావు చేసిన ఆరోపణలతో సినిమా టీజర్ మొదలవుతుంది. ఆ తరువాత మొత్తం ఎన్టీఆర్ వాయిస్ ఇమిటేషన్ తో టీజర్ ని నడిపించారు.

టీజర్ లో వర్మని, లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ తిడుతున్నట్లుగా వాయిస్ ఉంది. నీకు అధికారం కట్టబెట్టబోయి.. మేము అధికారం కోల్పోయాం. అవమానాల పాలయ్యాం. ఆర్జీవీ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో మునిగిపోయి మమ్మల్ని ఉపేక్షిస్తున్నారా?’ అంటూ ఎన్టీఆర్ ఆత్మ ప్రశ్నిస్తున్నట్టుగా టీజర్‌‌ను రూపొందించి వదిలారు. మీ మూలానే మా అధికారాన్ని పోగుట్టుకున్నామంటూ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని విమర్శించడం టీజర్ లో వినిపించారు. మరి ఇదెన్ని వివాదాలకు దారి తీస్తుందో మరి.