షాకింగ్.. దర్శకుడు అనిల్ రావిపూడి అరెస్ట్…?

Director Anil Ravipudi Arrested Archives

అదేంటి.. వరుణ్ తేజ్ ఏంటి.. అనిల్ రావిపూడిని అరెస్ట్ చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది. నిజంగానే సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిని అరెస్ట్ చేసాడు హీరో వ‌రుణ్ తేజ్. ఈ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఎఫ్2 సినిమా దుమ్ము దులిపేస్తుంది. వెంక‌టేష్‌కు కూడా చాలా ఏళ్ల త‌ర్వాత వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ ఇది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది.

ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నటించిన వారందరి సంగతి ఎలా ఉన్నా లీడ్ రోల్స్ లో ఒకరయిన వరుణ్ తేజ్ మాత్రం ‘ఎఫ్2’ సినిమా సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ ఓ సరదా ట్వీట్‌ తో పాటు, ఫొటోను కూడా షేర్ చేశారు. ‘థియేటర్లలో కడుపుబ్బా నవ్వించినందుకు అరెస్ట్ చేస్తున్నా’ అంటూ అనిల్ రావిపూడి చేతికి బేడీలు వేస్తున్న ఫొటోను షేర్ చేశాడు. అలాగే ‘నకిలీ పోలీసును కలవండి’ అంటూ మరో ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలను, కామెంట్లను చూసిన నెటిజన్లు సరదా సరదా కామెంట్లు పెడుతున్నారు.