రంగమ్మత్తకు మెగా ఛాన్స్‌

Anchor Anasuya Got Another Chance In Director Anil Ravipudi Multistarrer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘జబర్దస్త్‌’ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ పెళ్లి అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శణ చేస్తూ, బుల్లి తెర మరియు వెండి తెర అనే తేడా లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. బుల్లి తెరపై సత్తా చాటిన అనసూయకు వెండి తెరపై కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ‘క్షణం’ చిత్రంలో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న అనసూయ తాజాగా ‘రంగస్థలం’ చిత్రంలో పూర్తి స్థాయి పాత్రను చేసి స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. రంగస్థలంలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయ దశ తిరిగి పోయిందని చెప్పుకోవచ్చు. 

‘క్షణం’ చిత్రం తర్వాత చిన్న చిన్న చిత్రాల్లో ఆఫర్లు వచ్చిన అనసూయ పట్టించుకోలేదు. అయితే రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర చేసిన తర్వాత స్టార్‌ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేసేందుకు అడుగుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్‌ మూవీలో ఒక కీలక పాత్రను అనసూయతో చేయించేందుకు నిర్మాత దిల్‌రాజు ప్లాన్‌ చేస్తున్నట్లుగా తొస్తోంది. మల్టీస్టారర్‌ చిత్రంలోనే కాకుండా ఇంకా పలు చిత్రాల్లో కూడా రంగమ్మత్తకు ఆఫర్లు వస్తూ ఉన్నాయని సమాచారం అందుతుంది.