చిట్టిబాబు తర్వాత భరత్‌ దుమ్మురేపడం ఖాయం

Mahesh Bharath Ane Nenu Will Breaks Rangasthalam Movie Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈ సంవత్సరం ప్రారంభం అయిన మూడు నెలలు అయ్యింది. ఎట్టకేలకు ‘రంగస్థలం’ చిత్రం విజయాన్ని తీసుకు వచ్చింది. మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూళ్లు చేసి భారీ విజయం దిశగా దూసుకు పోతుంది. చాలా నెలల తర్వాత భారీ విజయం వచ్చిన నేపథ్యంలో రాబోతున్న సినిమాలపై అందరు ఆశలు పెట్టుకున్నారు. ‘రంగస్థలం’ తర్వాత ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోగల సత్తా మహేష్‌బాబు నటించిన ‘భరత్‌ అను నేను’కు ఉందని, తప్పకుండా మహేష్‌బాబు రంగస్థలం కలెక్షన్స్‌ను బీట్‌ చేసేలా సినిమా ఉంటుందని అంటున్నారు.

మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అను నేను’ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపించబోతున్నాడు. ‘దూకుడు’ సినిమాలో కాస్త రాజకీయ నేపథ్యంలో మహేష్‌బాబు కనిపిస్తేనే రికార్డులు బద్దలు అయ్యాయి. ఇక ఈసారి సినిమా మొత్తం కూడా రాజకీయ నేపథ్యం, అది కాకుండా సీఎంగా మహేష్‌బాబు కనిపించనున్న నేపథ్యంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి మామూలుగా ఉండదని అభిమానులు గట్టిగానే చెబుతున్నారు. అతి త్వరలోనే సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరుగబోతుంది. ఓవర్సీస్‌లో ‘రంగస్థలం’ చిత్రం రికార్డును బద్దలు కొట్టగల సత్తా మహేష్‌బాబుకు ఉందని ఫ్యాన్స్‌ మరియు ట్రేడ్‌ విశ్లేషకులు నమ్మకంతో ఉన్నారు.