రాత్రికి వస్తే కోటి ఇస్తాన్నారట…!

People Offering Rs 1 Crore Per Night After Seeing My Videos Says Sakshi Chaudhary

పోటుగాడు, జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా లాంటి సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండకపోవచ్చు కాని ఆ చిత్రంలో నటించిన సాక్షి చౌదరి మాత్రం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతూ గ్లామర్ నటిగా పాపులర్ అయ్యారు. అయితే హాట్ సుందరి అందాలను చూసి తరించాలి కాని అంతకు మించి ఏమైనా ఆశపడితే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చింది సాక్షి. నటిగా ఆకట్టుకోవడం ప్రేక్షకుల్ని ఉత్సాహపరచడమే నా పని, కాస్త హాట్ డోస్ పెరిగినా చూసి ఆనందించండి.

ఇప్పటికే నా వీడియోలు చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. ఆ ఆనందాన్ని ఆపుకోలేక చాలా మంది నాకు రేటు కడుతున్నారు. కొంతమంది అయితే ఒక రాత్రికి వస్తే ఏకంగా కోటి రూపాయలు ఇస్తా అంటూ ఆఫర్ ఇస్తున్నారు. రాత్రికి వస్తావా? రేటు ఎంత? అంటూ వేధిస్తున్నారు. నటి అయినంత మాత్రాన అంత చులకనగా చూడాల్సిన అవసరం లేదు. నాకు ఆఫర్స్ ఇచ్చే వాళ్లు పెద్ద మూర్ఖులు. ఇంకోసారి ఇలా చేస్తే వాళ్ల బండారం బయటపెడతా అంటూ కోటి ఆఫర్ చేసిన వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చింది సాక్షి చౌదరి.