ఎఫ్ 2 ట్రైలర్ కు రంగం సిద్దం

వెంకటేష్ హీరోగా చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపద్యంలో తన తరువాత సినిమా వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఎటువంటి అప్డేషన్ రాలేదు. దసరా ముందు రోజుమాత్రం ఈ చిత్రా ఫస్ట్ లుక్ ను మాత్రం విడుదల చేశారు. ప్రస్తుతం ఓ సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంను సక్సెస్ పుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్రని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే వరస పరాజయాలు వెంటాడుతున్నా దిల్ రాజునూ ఎఫ్2 చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇకా ఈ చిత్రం నుండి వచ్చే ట్రైలర్ ను డిసెంబర్ 12 న విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్బంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు నిర్మాతా దిల్ రాజు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ సరసన మేహ్రిన్ నటిస్తున్నది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలి అని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నది. ఈ చిత్రం తరువాత వెంకటేష్, నాగచైతన్య ల మల్టీ స్టారర్ వెంకీ మామా సెట్స్ పైకి వెళ్లనున్నది. నిర్మాత దిల్ రాజు కూడా తమిళ 96 మూవీని తెలుగులో రీమేక్ చేసేపనిలో ఉన్నాడు.