ఎఫ్ 2 కిక్ పెంచనున్న రంగమత్త

anasuya item song in f2 movie

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరి వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ ఎఫ్2 చిత్రం ఓ సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం నుండి ఓ లేటెస్ట్ అప్ డేట్ వినబడుతుంది. బుల్లి తెర జబర్దస్త్ యాంకర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసినా అనసూయ ఇటు యాంకర్ గాను మరియు సినిమాలో నటిస్తూ మంచి పేరును సంపాదించుకుంది. ఒక్క క్షణం సినిమాలో తన నటనకు మంచి మార్క్స్ పడ్డాయి ఆ చిత్రం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లబించింది. గతంలో అనసూయ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఏదైనా సినిమాలో నటిచాలి అంటే నా పాత్రకు సంబందించిన కథ ఆ సినిమాలో చాలా వరకు కీ రోల్ పోషించాలి అని అన్నారు.

ఎఫ్ 2 కిక్ పెంచనున్న రంగమత్త - Telugu Bullet

ఇప్పుడు ఆ విషయాని దృష్టిలో పెట్టుకొని అనిల్ రావిపూడి ఎఫ్2 సినిమాలో అనసూయ ని ఓ స్పెషల్ సొంగ్ లో నటింపజేయ్యాలి అని భావించి ఆమెను సంప్రదించాడట. తను కూడా ఓకే చెప్పడం అ సాంగ్ ఎఫ్2 చిత్రంకు ముడిపడి ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు అనసూయ తో ఎఫ్2 చిత్రంలో తియ్యబోయే సాంగ్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ లు కుడా స్టెప్స్ వెయ్యనున్నారు. గతంలో సాయి ధరం తేజ్ తో విన్నర్ అనే చిత్రంలో సుయ సుయ అనే సొంగ్లో నటించింది. ఈ చిత్రంను డైరక్టర్ అనిల్, లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. ఎఫ్2 చిత్రాని వచ్చే ఏడాది జనవరి విడుదల చెయ్యాలని చిత్ర నిర్మాత దిల్ రాజ్ భావిస్తున్నాడు.