మరోసారి రైతుల కోసం చిరు పోరాటం

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి చిత్రంతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా సురేందర్ రెడ్డి చిరంజీవి పై భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాణ సారద్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రం తరువాత తన తరువాత చిత్రాని కొరటాల శివ తో నటిస్తాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ కూడా పూర్తి స్క్రిప్ట్ వర్క్ పైన దృష్టి సారించాడు. స్క్రిప్ట్ వర్క్ కుడా దాదాపుగా పూర్తి కావచింది. ఈ చిత్రంలో కొరటాల శివ తన మార్క్ కనపడేవిధంగా, యాక్షన్ సిన్స్ తో పాటు సందేశాత్మక తో కూడిన ఓ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది అంట.

ముఖ్యంగా రైతులపైన తియ్యబోయే సిన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మెగా స్టార్ చిరంజీవితో తియ్యబోయే సినిమాను కొరటాల శివ జనవరిలో పూజ కార్యక్రమాలతో లాంచ్ చేస్తారు. ఆ తరువాత నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నది. ఈ చిత్రాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పైన నిర్మించనున్నాడు. కొరటాల శివ తరువాత త్రివిక్రమ్ తో కూడా అన్నయ్య ఓ సినిమాలో నటిస్తాడని ఈ చిత్రనికుడా రామ్ చరణ్ తన సొంత బ్యానర్ పైనా నిర్మిస్తాడు అంటున్నారు.