ఇప్పుడు వద్దా.. అసలే వద్దా..?

Producers Announced Director Teja And Venkatesh New Movie Cancelled

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వెంకటేష్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది అంటూ అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. అదుగో, ఇదుగో అంటూ వీరి కాంబో మూవీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో చిత్రీకరణ మొదలు కాబోతుందని చెప్పుకొచ్చారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. వెంకటేష్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఎఫ్‌2’ను కమిట్‌ అయ్యాడు. ఇక దర్శకుడు తేజ ‘ఎన్టీఆర్‌’ చిత్రం కోసం సన్నాహకాల్లో ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకుని వారి కాంబో మూవీని పక్కకు పెట్టినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మలీస్టారర్‌ చిత్రం కోసం ముందు నుండి అనుకున్నదాని కంటే వెంకటేష్‌ ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి వచ్చిందట. ఆ కారణంగానే తేజతో సినిమా ఇప్పుడు వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది. అదే విషయాన్ని తేజతో ప్రస్థావించగా సరే అన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే వీరిద్దరి కాంబో మూవీ ప్రస్తుతానికి వాయిదా పడ్డట్లా లేదా పూర్తిగా క్యాన్సిల్‌ అయినట్లా అంటూ సినీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వర్క్‌ను ఆపేసినట్లుగా నిర్మాతలు కూడా ప్రకటించారు. హీరోయిన్‌ శ్రియను ఎంపిక చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయం పుకార్లే అని నిర్మాతలు చెబుతున్నారు. మొత్తానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసిన వెంకీ, తేజ ‘ఆట నాదే వేట నాదే’ చిత్రం క్యాన్సిల్‌ అయినట్లే అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.