బాహుబలికి బోణీకపూర్‌కు సంబంధం ఏంటి

What Is The Relationship Of The Bahubali With Boney Kapoor

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ చిత్రంలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం కోసం మొదట శ్రీదేవిని రాజమౌళి సంప్రదించిన విషయం తెల్సిందే. స్వయంగా రాజమౌళి ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాము మొదట శ్రీదేవిని సంప్రదించాం అని, కాని ఆమె ఎక్కువ పారితోషికంతో పాటు, గొంతెమ్మ కోర్కెలు కోరడం వల్ల ఆమెను ఎంపిక చేయలేదని జక్కన్న చెప్పుకొచ్చాడు. తాజాగా ఆ విషయాన్ని రామ్‌ గోపాల్‌ వర్మ క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశాడు.

రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంలో నటించాల్సిందిగా తాను సూచించాను అని, మంచి ప్రాజెక్ట్‌ తప్పకుండా మంచి పేరు వస్తుందని తాను చెప్పాను, అందుకు శ్రీదేవి కూడా ఆసక్తి చూపించింది. కాని తెలుగులో నటించడం బోణీ కపూర్‌కు ఇష్టం లేదు. అందుకే ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేయడంతో పాటు పలు కండీషన్స్‌ పెట్టాడు. దాంతో రాజమౌళి ఆమె స్థానంలో మరోకరిని ఎంపిక చేసినట్లుగా రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పుకొచ్చాడు. రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా శ్రీదేవికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో పై వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీదేవి పలు సినిమాలను నిరాకరించడం వెనుక బోణీ కపూర్‌ ఉన్నాడని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.