మహానాయకుడు రిలీజ్ సరే…ఏమవుద్దో ?

Mahanayakudu Release Date Locked

యాత్ర సినిమా అంచనాలను మించి విజయం వైపుగా అడుగులు వేస్తుండటంతో నందమూరి అభిమానులు కంగారు పడుతున్నారు. ఇప్పుడు తమ మహానాయకుడు సినిమా ఏం చేయబోతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఫిబ్రవరి 22 న ఈ చిత్రం విడుదల కానుండటంతో బాలయ్య మహానాయకుడుతో ఈసారి ఎలాంటి మాయ చేయబోతున్నారా అని ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు. మరోపక్క యూనిట్ కూడా మహానాయకుడు సినిమాతో కచ్చితంగా విజయం అందుకోవాలని చూస్తోంది. కథానాయకుడు ఇబ్బంది పెట్టడంతో ఆ సినిమా కొని నష్టపోయిన బయ్యర్ల కోసమైనా మహానాయకుడు విజయం సాధించాలని కోరుకుంటున్నాడు బాలకృష్ణ. దానికి తోడు ముఖ్యమైన రాజకీయాలు మొత్తం మహానాయకుడు సినిమాలోనే ఉండటంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇన్నాళ్లు విడుదల తేదీ కోసం చూస్తున్న మహానాయకుడు ఫిబ్రవరి 22న వస్తుందని తెలియడంతో అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు.

ఇక ఫిబ్రవరి 16న అనంతపురంలో మహానాయకుడు ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. దీనికి తెలుగు ఇండస్ట్రీ అతిరథ మహారధులు హాజరవుతారని తెలుస్తోంది. యాత్ర సినిమా ఇప్పటికే చాలా చోట్ల 90 శాతం వసూళ్లు వెనక్కి తీసుకు వచ్చేసింది మరోవైపు మహానాయకుడు బిజినెస్ కూడా దాదాపు 50 కోట్ల వరకు జరుగుతోంది. చూడాలి మరి ఏమవుతుందో ?