డిస్ట్రిబ్యూటర్లను ముంచేసిన మిస్టర్ మజ్ను !

Majnu Collections Influenced Distributors

అక్కినేని మూడోతరం వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూడో సినిమా దాకా వచ్చినా హిట్ మాత్రం పలకరించడం లేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం షాకైంది. ఈ దెబ్బతో కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్న అఖిల్ విక్రం తో ‘హలో’ అంటూ పలకరించినా అది కూడా ప్లాప్ గానే నిలిచింది. ఇక మూడో ప్రయత్నంగా తెరకెక్కించిన మిస్టర్ మజ్ను అయినా హిట్ కొడుతుందేమో అందుకుంటే ఆ సినిమా మరీ దారుణ ఫలితాన్ని ఇచ్చింది. తొలిప్రేమతో తొలి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి, అఖిల్ కాంబోపై ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. తీరా సినిమా విడుదలయ్యాక ఆ అంచనాలు అన్నీ నీరు గారి పోయాయి. పది రోజులకే అన్ని థియేటర్లలో సినిమా తీసేసేన పరిస్థితి ఎదురుకావడంతో ఈ సినిమా దారుణమైన కలెక్షన్లు రాబట్టి డ్రిస్టిబ్యూటర్లకు పీడకల మిగిల్చింది. మిస్టర్ మజ్ను బిజినెస్ 12.82 కోట్లకు క్లోజ్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.23కోట్ల వరకు జరిగింది. అంటే అందులో కేవలం సగం మాత్రమే రాబట్టినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. మరి నాలుగో సినిమాతో అయినా గెట్టేక్కుతాడో లేక చతికిల పడతాడో చూడాలి ఈ అక్కినేని హీరో.