అఖిల్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేసిన శ్రీకాంత్ అడ్డాల!

tollywood actor Akhil Akkineni
Akhil

ఎంత మంది అగ్ర దర్శకులు వచ్చిన సినిమా చేసిన అఖిల్‌‌కి మాత్రం బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోతున్నారు. డైరెక్టర్స్‌‌ సరిగ్గా తీయలేక పోతున్నారా..?లేక కథల ఎంపికలో పొరపాటు చేస్తున్నాడా..? ఇలా చాలా సందేహాలు కలుగుతున్నాయి.కొందరైతే అఖిల్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసి .. క్రికెట్ మీద దృష్టి పెట్టడం మంచిదని కొందరు నెటిజన్లు అంటున్నారు. మనోడు క్రికెట్‌‌లో ఇరగదిస్తాడు అది వేరే విషయం అనుకోండి. ఇకపోతే ఇటీవల కాలంలో వచ్చిన అఖిల్ సినిమా కూడా డిసాస్టర్ కావడంతో మనోడి కెరీర్ ఇబ్బందుల్లో పడినట్లయింది. ఇది ఇలాగే కొనసాగితే.. అఖిల్ సినిమాలకు గుడ్ బై చెప్పక తప్పదు.‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అఖిల్ కెరీర్‌‌లో ఎదైనా చెప్పుకోదగ్గ సినిమా ఉందని చెప్పాలి. అయితే తాజాగా అఖిల్ కోసం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఓ మంచి కథ రెడీ చేసి తీసుకొచ్చారని విశ్వసనీయ వర్గాల వినికిడి .డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం ‘పెద కాపు’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. కొత్త నటీనటులతో ఈ సినిమా చేస్తున్నాడు. అది మాస్ యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది.శ్రీకాంత్ ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలు చేయలేదు. తనదంతా లవ్ స్టోరీస్ ,ఫ్యామిలీ సినిమాలే.. మరి యాక్షన్ కథను తీయగలడా అని కొందరు సందేహ పడుతున్నారు.