సూపర్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్..ఇంకోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ

Super Glimpses of
Super Glimpses of "Mirai" Title.. Teja Sajja is going to surprise again

లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ మూవీ “హను మాన్” (Hanu Man Teja Sajja) తో పాన్ ఇండియా ఫేమ్ ని అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ చేస్తున్న తదుపరి మూవీ నే “మిరాయ్”. టాలీవుడ్ యాక్షన్ సినిమా లవర్స్ కి మాస్ మహారాజ్ రవితేజతో “ఈగల్” అనే మూవీ తో క్రేజీ ట్రీట్ ను అందించిన టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీ ని తెరకెక్కిస్తుండగా ఈ మూవీ లో సూపర్ యోధా గా తేజ కనిపించనున్నాడు.

మరి ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్స్ తో ఆసక్తి రేపిన మేకర్స్ ఇప్పుడు టైటిల్ రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనుకున్నట్టుగానే “మిరాయ్” అంటూ టైటిల్ ను అనౌన్స్ చేసిన మేకర్స్ ఒక ఊహించని ట్రీట్ ను అయితే ఈ మూవీ తో అందిస్తున్నారని చెప్పాలి. సామ్రాట్ అశోక కళింగ యుద్ధం ఆ పరిణామాల తర్వాత వచ్చిన 9 గ్రంథాలు వాటిని తరాలుగా కాపాడుతూ వస్తున్నా 9 మంది యోధులు అంటూ ఒక రేంజ్ ఆసక్తిని ఈ గ్లింప్స్ రేకెత్తించింది.

Super Glimpses of "Mirai" Title.. Teja Sajja is going to surprise again
Super Glimpses of “Mirai” Title.. Teja Sajja is going to surprise again

అంతే కాకుండా ఆ యాక్షన్ విజువల్స్ అయితే మైండ్ బ్లాకింగ్ గా బిగ్ స్క్రీన్స్ పై ప్రామిసింగ్ ట్రీట్ ను అందించబోతున్నాయి అని అనిపిస్తుంది. ఇక సూపర్ యోధాగా తేజ సజ్జ మరోసారి షైన్ అయ్యాడు అని చెప్పాలి. హను మాన్ లో సూపర్ హీరోగా అదరగొట్టిన తను ఇప్పుడు ఈ మూవీ లో కూడా సాలిడ్ ట్రీట్ ని తన సైడ్ నుంచి ఇవ్వబోతున్నట్టుగా అనిపిస్తుంది.

ఆ యాక్షన్ సీక్వెన్స్ లు తన ప్రెజెన్స్ అంతా వేరే లెవెల్లో కనిపిస్తుంది. ఇక మూవీ కి కూడా హను మాన్ మ్యూజిక్ దర్శకుడు గౌర హరి నే సంగీతం అందిస్తుండగా తన స్కోర్ ఈ టీజర్ గ్లింప్స్ లో మరింత ఆకర్షణగా నిలిచింది. ఇంకా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణ విలువలు అయితే ఇందులో ఎక్స్ట్రార్డినరీగా కనిపిస్తున్నాయి. ఇక ఈ భారీ మూవీ ని మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ 19న 3డి లో కూడా రిలీజ్ చేయబోతుండడం విశేషం. అలాగే ఈ మూవీ 7 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.