“కన్నప్ప” లో మరో స్టార్ హీరోయిన్ .. ఎవరో తెలుసా ?

Another star heroine in
Another star heroine in "Kannappa" .. do you know who?

టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సహా తన డ్రీం ప్రాజెక్ట్ కూడా కాగా ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఇది మారుతూ వెళ్తుంది . అయితే రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నట్టుగా వార్తలు రాగా కన్నప్ప మూవీ పేరు మరింత స్థాయిలో వినిపించింది.

Another star heroine in "Kannappa" .. do you know who?
Another star heroine in “Kannappa” .. do you know who?

అయితే లేటెస్ట్ గా మూవీ భారీ తారాగణంలో మరో స్టార్ నటి పేరు బయటకి వచ్చింది. ఆమె ఎవరో కాదు సౌత్ ఇండియా స్టార్ నటి కాజల్ అగర్వాల్. ఈమె కూడా ఇప్పుడు ఈ మూవీ లో కనిపిస్తుంది అని కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఇది దాదాపు నిజం అన్నట్టుగానే వినిపిస్తుంది. ఆల్రెడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక కాజల్ పై అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ మూవీ కి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.