‘ఇస్మార్ట్’ హీరోతో మహేష్ బాబు కొత్త మూవీ !?

Mahesh Babu's new movie with 'Ismart' hero!?
Mahesh Babu's new movie with 'Ismart' hero!?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannath) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్” (Double iSmart) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ తర్వాత రామ్ మరింత ఆసక్తికర లైనప్ ను సెట్ చేసుకోగా ఇప్పుడు ఈ లైనప్ లోకి దర్శకుడు మహేష్ బాబు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది.

Mahesh Babu's new movie with 'Ismart' hero!?
Mahesh Babu’s new movie with ‘Ismart’ hero!?

స్టార్ బ్యూటీ అనుష్క అలాగే నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో చేసిన “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” తో మంచి హిట్ ని అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు రామ్ తో ఒక సాలిడ్ ప్రాజెక్ట్ చేయనున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక మరోపక్క అభిమానులు అయితే డబుల్ ఇస్మార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే పూరి, ఛార్మి లు నిర్మాణం వహిస్తున్నారు.