ఓటిటిలో “పుష్ప 2” ఆల్ టైం రికార్డులు సృష్టిస్తుందా?

Will “Pushpa 2” create all-time records in OTT?
Will “Pushpa 2” create all-time records in OTT?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ మూవీ “పుష్ప 2 ది రూల్” (Pushpa 2) కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మూవీ కి సెన్సేషనల్ బిజినెస్ అయ్యితే ఇప్పుడు నడుస్తుంది. తాజాగా నార్త్ హక్కులే సుమారు 200 కోట్లకు అమ్ముడుపోయిన వార్తలు కేజ్రీగా మారగా ఇప్పుడు పుష్ప 2 ఓటిటి (Pushpa 2 OTT Deal) డీల్ పై వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి.

Will “Pushpa 2” create all-time records in OTT?
Will “Pushpa 2” create all-time records in OTT?

అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం పుష్ప 2 ట్టాల్టోటల్ ఓటిటి హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తంలో 275 కోట్ల డీల్ తో పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది . మరి ఈ మొత్తం అయితే ఇండియా లోనే అత్యధికం అన్నట్టుగా వినిపిస్తోంది . దీనికి ముందు “రౌద్రం రణం రుధిరం” ఆల్ టైం రికార్డు ఉండగా దానిని ఇప్పుడు పుష్ప 2 తో అల్లు అర్జున్ బ్రేక్ చేసినట్టుగా తెలుస్తోంది .

మరి మొత్తానికి అయితే పుష్ప 2 పై ఉన్న క్రేజ్ మాములు లెవెల్లో లేదని చెప్పుకోవాలి . ఇక ఈ మూవీ లో రష్మికా హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, ఫహద్ ఫాజిల్ అలాగే అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుండగా ఈ ఆగస్ట్ 15న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కు రాబోతుంది.