సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని BRS నేత మృతి

నల్గొండలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అద్దంకి నార్కట్ పల్లి హైవే పై ఈ ఘటన చోటు చేసుకుంది. సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని నాలుగొండలో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని నల్గొండ పట్టన BRS ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు(51)గా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అటుగా వస్తున్న జనార్ధన్ బైక్ ను ఢీకొట్టిన కారు దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెల్లినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే… బుధవారం మధ్యాహ్నం సమయంలో జనార్ధన్ రావు పట్టణంలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద తన దత్తసాయి వెంచర్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.

ఈ సమయంలోనే హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు నటుడు రఘుబాబు తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నల్గొండలోని బైపాస్ రోడ్డు వద్ద బైక్ ను కారు బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. జనార్దన్ రావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా.. ప్రమాదం జరిగిన తర్వాత మాట్లాడిన నటుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆయన టెన్షన్ పడుతున్నట్లు కనిపించింది. అయితే ప్రమాద సమయంలో థాని కారు లోనే ఉన్నాడు కానీ డ్రైవర్ కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.