ఓటీటీలోకి విజయ్ ఆంటోని ‘హత్య’..ఎప్పుడంటే?

vijay antony hatya movie ott
vijay antony hatya movie ott

నటుడు విజయ్ ఆంటోని వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. బిచ్చగాడు సినిమాతో సంచలన విజయం అందుకున్న విజయ్ ఆంటోని ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత పలు సినిమాలు వచ్చినప్పటికి ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల కాలంలో విజయ్ ఆంటోని హత్య సినిమా జూలై 21న విడుదలైంది. ఈ సినిమాలో విజయ ఆంటోని, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.

సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి ప్రేక్షకుల నుంచి మంచి కలెక్షన్లను వసూల్ చేసింది. కాగా ఈ సినిమా ఓటీటీలోకి విడుదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగు , తమిళ భాషల్లో ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. సినిమాలో ప్రధాన పాత్రదారి మోడల్ లైలాని ఎవరో హత్య చేస్తారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకవు. దీంతో ఆమె మర్డర్ కేసుని డిటెక్టివ్ వినాయక్ తో పాటు IAS అధికారి సంధ్య కలిసి దర్యాప్తు చేస్తారు. అంతిమంగా వీరి దర్యాప్తులో ఏం తేలింది? ఈ హత్యని ఎలా పరిష్కరించారు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.