“సూర్య సన్నాఫ్ కృష్ణన్” చిత్రం రీరిలీజ్ సెన్సేషనల్ రెస్పాన్స్!

surya son of krishnan
surya son of krishnan

విలక్షణ అగ్ర కథానాయకుడు సూరియా హీరోగా ,సమీరా రెడ్డి హీరోయిన్ హా దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “సూర్య సన్నాఫ్ కృష్ణన్”. మరి ఈ చిత్రం నిన్న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కాగా మన స్టార్ హీరోల సినిమాలు రేంజ్ లో అయితే ఈ చిత్రానికి మన ప్రేక్షకుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందించారు.
ఇక ఈ చిత్రం అయితే తాజాగా క్రేజీ రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుకే ఒక కోటి గ్రాస్ అందుకున్న చిత్రాల లిస్ట్ లో ఈ చిత్రం కూడా ఇప్పుడు నిలిచినట్టుగా తెలుస్తుంది. దీనితో కోలీవుడ్ నుంచి వచ్చిన మొట్ట మొదటి మూవీ గా సూర్య సన్నాఫ్ కృష్ణన్ అయితే రికార్డు సెట్ చేసింది. అంతే కాకుండా నిన్న ఒక్కరోజులోనే ఇరవై నాలుగు వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. మరి ఈ చిత్రానికి హరీష్ జై రాజ్ ఇచ్చిన మెస్మరేజింగ్ ఆల్బమ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు