జబర్దస్త్ కమెడియన్ కు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ.

Jabardasth Emmanuel
Jabardasth Emmanuel

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ద్వారా బాగా జనాదరణ పొందిన కమిడియన్లు ఏదో ఒక విధంగా రాజకీయ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న తెలిసిన విషయమే . ఇప్పటికే హైపర్ ఆదినతో పాటు చాలామంది కమెడియన్లు సినిమా సెలబ్రిటీలనే కాకుండా రాజకీయ నాయకులను కూడా విమర్శిస్తూ ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ ఇమ్మానుయేల్ కి కూడా YCP పార్టీ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది.
అసలు విషయం ఏమిటంటే . తాజాగా జబర్దస్త్ ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇందులో అతడు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తుండగా ఆ గ్రామంలో ఉండే అమ్మాయిని ప్రేమలో పడేసి ప్రేమ వాలంటీర్ గా మారిపోతాడు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను నిన్న విడుదల చేసారు . కాగా ఈ ట్రైలర్ చూసిన YCP మద్దతుదారులు ఇమ్మానుయెల్ ను హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రామ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి సమయంలోనే రిస్క్ చేసి మరి వాలంటీర్ మీదే వెబ్ సిరీస్ తీయడంకష్టం తో కూడుకున్న పనే అని చెప్పాలి .. అందుకే ఇమ్మానుయెల్ ను వారు హెచ్చరిస్తున్నారు . ఏమైనా తేడా వస్తే నీ అంతు చూస్తామని అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్లు కూడా పెడుతున్నారు.. మరొకవైపు ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ అభిమానులు మాత్రం హీరోగా మొదటి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వాలని ఇమ్మానుయేల్ తో పాటు దర్శకత్వం ,రచన వహిస్తున్న బాబుకి కూడా మంచి పేరు రావాలని కామెంట్లు చేస్తున్నారు.