నటి పూర్ణ కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడో తెలుసా ?

tollywood actress purnaa son images
tollywood actress purnaa son images

నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ నటి,మోడల్ , డ్యాన్సర్ గా అందరికి సుపరిచితమే. ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగు,తమిళం , మళయాలం సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. వెండితెరపై ఓ టీవీ షోలో జడ్జిగా వ్యవహరించింది. తెలుగులో అవును సినిమా హీరోయిన్ పూర్ణకు మంచి పేరు తీసుకువచ్చాయి. హీరోయిన్ పూర్ణ 2022 జూన్ 12న దుబాయ్ కి చెందిన బిజినెస్ మేన్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్నారని సంగతి తెలిసిందే.ఈ ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.అయితే తాజాగా తన కొడుకును ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రపంచానికి పరిచయం చేసింది.పూర్ణ కొడుకును చూసిన నెటిజన్స్ చాలా ముద్దుగా అందంగా ఉన్నాడంటూ ప్రశంసించారు . సాధారణంగా సెలబ్రిటీలు వారి పిల్లలను మీడియాకు చిక్కకుండా జాగ్రత్తపడుతుంటారు. కొంత వయసు వచ్చేంతవరకు వారి ఫొటోలను బయటపెట్టరు. ఇప్పటి వరకు తన కొడుకును బాహ్య ప్రపంచానికి పరిచయం చేయలేదు. తాజాగా ఓ పెళ్లి ఫంక్షన్ కు భర్త ఆసిఫ్ అలీతో పాటు కొడుకుతో హాజరైనా సందర్భంగా అక్కడ తీయించుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. దీంతో క్షణాల్లోనే ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.