“చంద్రముఖి 2” సింపుల్ గా కంగనా ఫస్ట్ లుక్.!

tollywood movie chandhramukhi 2
tollywood movie chandhramukhi 2

సూపర్ స్టార్ రజినీకాంత్ సెన్సేషనల్ హిట్ చిత్రం “చంద్రముఖి” కి సీక్వెల్ గా దర్శకుడు పి వాసు టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ తో “చంద్రముఖి 2” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి దీనిపై మంచి అంచనాలు నెలకొనగా ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్ గానే హీరో లారెన్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా దానికి అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఇక తనతో పాటుగా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా నటిస్తున్నారు . ఈ చిత్రంలో చంద్రముఖి గా కంగనా రనౌత్ నటించగా ఆమె ఫస్ట్ లుక్ ని ఇప్పుడు విడుదల చేసారు. మరి ఇందులో అయితే చంద్రముఖి గా తాను చాలా అందంగా ఓ అద్దం ముందు నించుని తనని తాను చూసుకుంటున్న సింపుల్ లుక్ ని అయితే ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి అయితే సంగీతం అందిస్తుండగా ,పాన్ ఇండియా వైడ్ లైకా ప్రొడక్షన్స్ వారు ఈ వినాయక చవితి కానుకగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.