సీఎం యోగి కాళ్లు మొక్కడంపై రజనీకాంత్ వివరణ..!

Rajinikanth's explanation on planting CM Yogi's legs..!
Rajinikanth's explanation on planting CM Yogi's legs..!

ఆధ్యాత్మిక పర్యటనలో సూపర్ స్టార్ రజినీకాంత్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హిమాలయాల నుంచి తన పర్యటన షురూ చేసిన తలైవా.. ఆ తర్వాత యూపీ ,ఉత్తరాఖండ్ ఇలా అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవలే ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రితో కలిసి రాంచీలో చిత్రాన్ని వీక్షించిన ఆయన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్యతోనూ కలిసి సినిమా చూశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిసిన రజనీ.. ఆ సమయంలో యోగికి పాదాభివందనం కూడా చేశారు.

ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పెద్ద ఎత్తు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా తమిళ ప్రజలు రజినీ చేసిన పని చూసి ఆగ్రహానికి గురయ్యారు. తలైవా.. యోగీ కాళ్లు మొక్కడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సూపర్ స్టార్ స్పందించారు.

“సన్యాసీలు ,యోగుల పాదాలను తాకి, వారి ఆశ్వీర్వాదాలను తీసుకోవడం నా అలవాటు. నాకన్నా చిన్నవారైనా ఇలానే చేస్తానని ” అంటూ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు.