దళపతి 69 :ఇది మాత్రం కంఫర్మ్ అయితే ఇండియా లోనే ఒక పెద్ద మల్టీస్టారర్…!

Dalapati 69 : This is confirmed but a big multistarrer in India...!
Dalapati 69 : This is confirmed but a big multistarrer in India...!

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో చేస్తున్న భారీ మూవీ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ విజయ్ కెరీర్ లో 68వ మూవీ గా వస్తుండగా ఈ మూవీ తర్వాత విజయ్ మరొక్క మూవీ మాత్రం చేసి సినిమాలకి స్వస్తి చెప్పనున్నాడు అని కన్ఫర్మ్ చేసాడు.

Dalapati 69 : This is confirmed but a big multistarrer in India...!
Dalapati 69 : This is confirmed but a big multistarrer in India…!

అయితే ఇది విజయ్ కెరీర్ లో 69వ మూవీ కోసం పెద్ద సస్పెన్స్ నెలకొనగా ఈ మూవీ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో విజయ్ తో “బీస్ట్”, రజినీతో “జైలర్” మూవీ లు చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చేసిన లేటెస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు కేజ్రీగా మారింది.

తనకి కానీ విజయ్ 69వ మూవీ (Thalapathy 69) చేసే ఛాన్స్ వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అలాగే మళయాళం నుంచి మమ్ముట్టి (Mammootty) లని విజయ్ తో ఆ మూవీ లో చూపిస్తానని చెప్పుకొచ్చాడు. దీనితో ఈ కాంబినేషన్ కానీ పడితే మాత్రం ఇండియా లోనే ఒక సెన్సేషనల్ మల్టీ స్టారర్ గా అవుతుంది అని చెప్పాలి. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏమవుతుందో అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి .