National Politics: శ్రీరామనవమి స్పెషల్.. అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం

National Politics: Sriramanavami special.. Suryatilakam to Ayodhya Ram today
National Politics: Sriramanavami special.. Suryatilakam to Ayodhya Ram today

ఇవాళ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి సన్నిధిలో మొదటి సారిగా వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం రామజన్మభూమి ట్రస్టు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ బాలక్ రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.

జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్య రామాలయంలో నేడు జరగబోతోంది తొలి శ్రీరామనవమి. సూర్యకిరణాల ప్రసరణ ఏర్పాట్లను మంగళవారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన కిరణాలతో ‘తిలకం’ ఏర్పాటు చేయడమే సూర్య తిలక్‌ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం అని ఈ ప్రాజెక్టుకు సహకరించిన సీఎస్‌ఐఆర్‌ – సీబీఆర్‌ఐ రూర్కీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.కె.పాణిగ్రాహి తెలిపారు. చైత్రమాసంలో వచ్చే ఈ పండుగ వేళ మధ్యాహ్నం ఆ దృశ్యాన్ని చూడవచ్చని చెప్పారు. 3 నుంచి మూడున్నర నిమిషాలపాటు ఉండే ఈ సూర్యకిరణాల తిలకం 58 మి.మీ.ల పరిమాణంలో ఉంటుందన్నారు. ఇందులో రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపిస్తుంది.