శుభవార్త : విశ్వక్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్..!

Good news: Vishwak
Good news: Vishwak "Gangs of Godavari" teaser..!

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari). ఈ మూవీ ను మే 17, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నేడు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. త్వరలో ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

Good news: Vishwak "Gangs of Godavari" teaser..!

Good news: Vishwak “Gangs of Godavari” teaser..!

రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ కట్ సూపర్ గా వచ్చినట్లు సమాచారం. ఈ మూవీ లో హీరో విశ్వక్ సేన్ లంకల రత్న అనే పాత్రలో నటిస్తున్నారు. తన రోల్ కు సంబందించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తి అయ్యింది. నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ మూవీ స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.