నా కల నెరవేరిందంటున్న తమన్నా !

tollywood actress Tamannaah Bhatia
Tamannaah Bhatia

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌‌ మొదలై 20 ఏళ్లు కావస్తోంది. అయినా ఆమె జోరు తగ్గడం లేదు. ఇటు తెలుగు, తమిళ్ తో పాటు అటు బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వాటిలో చిరంజీవి, రజనీకాంత్ సరసన నటించిన క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా ‘భోళా శంకర్’ నటించగా ఈ నెల 10న విడుదలవనుంది. రజనీకాంత్‌ హీరోగా వస్తున్న ‘జైలర్’ చిత్రం ఆ తర్వాతి రోజు అంటే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటు వైపు మెగాస్టార్ చిత్రం తో , అటు వైపు సూపర్ స్టార్ చిత్రాల్లో నటించడంతోనే తన కల నెరవేరిందని తమన్నా చెబుతోంది. ఈ రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్‌లో విడుదల కావడంతో ఆనందంతో పాటు , ఉద్వేగం కూడా కలుగుతున్నాయని అంటోంది.

చిరంజీవి గారితో సైరాలో చేసినా అందులో ఆయనతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రాలేదని . కీర్తి సురేష్ గొప్ప నటి. తనతో కలిసి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఇక జైలర్ చిత్రంలో నాది చిన్న పాత్రనే. కానీ, రజనీ కాంత్ గారితో కలిసి తెర పంచుకోవడం నా జీవితంలో గుర్తుండిపోయే అనుభవం’ అని చెప్పుకొచ్చింది.