ఎట్ట‌కేలకి త‌న నాలుగో చిత్రం మొద‌లు పెట్టిన అఖిల్

akhil started his fourth film

అక్కినేని మూడోత్ర‌యం వార‌సుడు అఖిల్ త‌న పేరుతోనే రూపొందిన అఖిల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తొలి సినిమానే ఫ్లాప్ కావ‌డంతో కాస్త నిరాశ‌కి గుర‌య్యాడు. ఆ త‌ర్వాత విభిన్న క‌థాంశంతో హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు చేశాడు. ఇవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ఆయ‌న నాలుగో సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నాడు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న నాలుగో చిత్రాన్ని అఖిల్ చేయ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, రెగ్యుల‌ర్ షూటింగ్ నిన్న‌టి నుండి మొద‌లు పెట్టారు. ఇందుకి సంబంధించి ఓ వీడియోని కూడా విడుద‌ల చేశారు చిత్ర బృందం. ఈ చిత్రంలో అఖిల్‌కి త‌ల్లిగా సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని న‌టిస్తుంద‌ట‌. చిత్రంలో త‌ల్లి పాత్ర కీల‌కం కాగా, ఆ పాత్ర‌కి ఆమ‌ని అయితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు ఆమెని ఎంపిక చేశాడ‌ట‌. గోపి సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో క‌థానాయిక‌గా ఎవరిని ఎంపిక చేశార‌నే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.