‘అ..ఆ’లు నేర్పుతున్న సంపూర్ణేష్‌

new song from kobbarimatta

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ న‌టించిన కామెడీ చిత్రం కొబ్బ‌రి మ‌ట్ట‌. 2015లో మొద‌లైన ఈ చిత్రం జూలై 19న విడుద‌ల కానుంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని మ‌ళ్ళీ ఆ డేట్ మారుస్తూ ఆగ‌స్ట్ 2న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు అనౌన్స్ చేశారు. ఇక తాజాగా చిత్రం నుండి అ..ఆ , ఇ..ఈ అంటూ సాగే పాట‌కి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఈ పాట మొత్తం తెలుగు అక్ష‌ర‌మాల‌తోనే ఉండ‌గా ఇందులో సంపూర్ణేష్ స్టెప్స్ అభిమానుల‌కి మంచి వినోదాన్ని క‌లిగిస్తున్నాయి. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. కొబ్బ‌రి మ‌ట్ట చిత్రానికి సంబంధించి గ‌తంలో ప‌లు సాంగ్స్‌, టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది. ‘హృదయ కాలేయం’, ‘సింగం 123’ తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు కొబ్బరి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు.