మరో ‘హృదయకాలేయం’ ఈ కొబ్బరిమట్ట

Sampoornesh Babu Kobbari Matta Movie updates

సంపూర్నేష్‌బాబు హీరోగా స్టీఫెన్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘హృదయకాలేయం’ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో ఆకట్టుకునే కథ లేదు, స్క్రీన్‌ప్లే లేదు, ఏమాత్రం స్టార్‌ కాస్టింగ్‌ లేదు. అయినా కూడా ఫుల్‌ కామెడీతో ఈ చిత్రం తెరకెక్కిన కారణంగా సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. అదే కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చ లేవనెత్తుతుంది. గత మూడు సంవత్సరాలుగా ఈ చిత్రం సెట్స్‌ పైనే ఉంది. భారీ ఎత్తున ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అప్పటి నుండి కూడా చెబుతూ వస్తున్నారు.

kobbari matta

హృదయకాలేయం చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం పెద్ద ఎత్తున కామెడీని కలిగి ఉంటుందని తాజాగా విడుదలైన పాట టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. తాజాగా బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ పార్టిసిపెంట్స్‌ ముఖ్య అతిథులుగా ఈ చిత్రం పాట ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం టీజర్‌కు అనూహ్యంగా అదిరిపోయే రెస్పాన్స్‌ దక్కింది. సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు, ప్రేక్షకులు అంతా కూడా ఈ టీజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. నవంబర్‌ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతో సంపూర్నేష్‌బాబు భవితవ్యం తేలిపోయే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.