మళ్లీ మంచి మనసు చాటుకున్న సంపూ…!

Sampoornesh Babu Announces Rs 50000 For Titli Cyclone Victims

తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా తానున్నాను అంటూ ముందుకు వచ్చి, స్పందించే వ్యక్తి సంపూర్నేష్‌బాబు. ఆమద్య హుదూద్‌ తుఫాన్‌ సమయంలో ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇలా పలు సార్లు తన మంచి తనం చాటుకుని, తెలుగు వారికి తాను అండగా నిలుస్తాను అంటూ ముందుకు వచ్చిన సంపూర్నేష్‌బాబు తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలు తిత్లీ తుఫాన్‌ కారణంగా అతలాకుతలం అవుతున్న విషయం తెల్సిందే. దాంతో సంపూర్నేష్‌బాబు తన సన్నిహితులను మరియు స్నేహితులను శ్రీకాకుళం వారిని ఆదుకోవాలంటూ పిలుపునిచ్చాడు.

cyclone

సంపూర్నేష్‌బాబు ట్విట్టర్‌లో.. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్‌ వల్ల చాలా నష్టం జరిగిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. వెంటనే మనవంతు సాయంను చేయాలని కోరుకుంటున్నాను. నావంతు సాయంగా 50 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నాను అంటూ ప్రకటించాడు. గతంలో కూడా తనకు తోచిన సాయంను ముఖ్యమంత్రి నిధికి అందించిన సంపూర్నేష్‌బాబు ఈసారి కూడా టాలీవుడ్‌ నుండి స్పందించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. సంపూలా ఇతర హీరోలు కూడా ముందుకు రావాలని అంతా కోరుకుంటున్నారు.

sampoornesh-babu