తేల్చి చెప్పిన త్రివిక్రమ్‌…!

Trivikram Upcoming Movie With Alluarjun

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో భారీ డిజాస్టర్‌ను చవి చూసిన విషయం తెల్సిందే. ‘ఖలేజా’ చిత్రం తర్వాత అంతకు మించిన ఫ్లాప్‌ అజ్ఞాతవాసి నిలిచింది. అజ్ఞాతవాసి ప్రభావంతో త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు సినిమాను చేసిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ‘అరవింద సమేత’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, నందమూరి అభిమానులను ఫిదా చేసిన ‘అరవింద సమేత’ చిత్రం మొదటి రోజే నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకున్న విషయం తెల్సిందే.

alluarjun

ఇలాంటి సమయంలో త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. బన్నీతో తాను త్వరలో సినిమా మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక త్రివిక్రమ్‌, బన్నీల కాంబోలో హ్యాట్రిక్‌కు అంతా సిద్దం అంటూ ఎదురు చూస్తున్నారు. నా పేరు సూర్య చిత్రం తర్వాత బన్నీ తదుపరి చిత్రం విషయంలో చాలా ఆలోచనల్లో ఉన్నాడు. ఇన్నాళ్లకు త్రివిక్రమ్‌తో మూవీని చేయాలని బన్నీ ఫిక్స్‌ అయ్యాడు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రారంభించి, అదే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.

allu-arjun