ఎక్కువ ఇస్తామన్నా వద్దంటున్న ఎన్టీఆర్‌

NTR Rejecting 45 Lakhs Remuneration In Bigg Boss Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘బిగ్‌బాస్‌’ షో కారణంగా స్టార్‌మాటీవీ నెం.1 స్థానంను దక్కించుకుంది. గత కొన్నాళ్లుగా నెం.1 స్థానం కోసం మాటీవీ ఎంతో ప్రయత్నం చేసింది. కాని నెం.1 స్థానంకు వెళ్లలేక పోయింది. జెమిని టీవీ మరియు ఈటీవీలో కార్యక్రమాలతో స్టార్‌ మాటీవీ పోటీ పడలేక చేతులెత్తేసింది. ఎట్టకేలకు ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ అంటూ రావడంతో ప్రేక్షకులు అంతా కూడా స్టార్‌ మాటీవీకి ట్యూన్‌ అయ్యి కూర్చున్నారు. దాంతో ఒక్క వారంలోనే స్టార్‌ మాటీవీ స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఈ షో ఇలాగే కంటిన్యూ అయితే రికార్డు స్థాయిలో స్టార్‌ మాటీవీ రేటింగ్‌ వెళ్లడం ఖాయం. స్టార్‌ మాటీవీ నెం.1కు వెళ్లిన సందర్బంగా ఎన్టీఆర్‌ పారితోషికం పెంచాలని బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు భావించారు.

ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌లో శని, ఆది వారాలు కనిపిస్తాడు. ఆ రెండు రోజులకు గాను 35 లక్షల పారితోషికాన్ని అందుకుంటున్నాడు. స్టార్‌ మాటీవీ వారు పది లక్షలు పెంచి 45 లక్షలు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. కాని ఎన్టీఆర్‌ మాత్రం ముందుగా మాట్లాడుకున్న పారితోషికం చాలు అని, ఆ మొత్తంను పార్టిసిపెంట్లకు ఇవ్వాల్సిందిగా సూచించాడట. అందుకే మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయిన జ్యోతికి డబుల్‌ పారితోషికం దక్కిందని, అలాగే సంపూర్నేష్‌బాబు నుండి స్టార్‌ మా వారు ఫెనాల్టీని వసూళ్లు చేయలేదు అని సమాచారం అందుతుంది. తాజాగా ఎలిమినేట్‌ అయిన మధు ప్రియకు కూడా ఊహించని స్థాయిలో పారితోషికం దక్కింది. మొత్తానికి ఎన్టీఆర్‌ వల్ల బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్లు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. మరో వైపు బిగ్‌బాస్‌ కారణంగా ఎన్టీఆర్‌కు కూడా భారీ క్రేజ్‌ దక్కింది.

మరిన్ని వార్తలు:

వర్మ నీకిది తగునా?

 బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన బింధుమాధవి

రానా కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’