రానా కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’

rana nene raju nene mantri movie updates

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘లీడర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రానా మొదటి సినిమాతోనే నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాతో నటుడిగా తన స్థాయి పెంచుకుంటూ వచ్చాడు. ‘బాహుబలి’ సినిమాతో నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. హీరోగా మంచి స్థాయిలో ఉన్న రానా ‘బాహుబలి’ సినిమాలో విలన్‌ పాత్రకు ఒప్పుకున్నాడు అనే వార్తలు రాగానే అంతా కూడా అవాక్కయ్యారు. అయితే ‘బాహుబలి’ సినిమాతో రానాలోని అసలైన నటుడు బయటకు వచ్చాడు. అద్బుతమైన నటనతో విలనిజంను కనబర్చి సినిమాకే హైలైట్‌ అయ్యాడు. ఇప్పుడు ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.

‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవుడు పాత్ర ఏ స్థాయిలో ప్రేక్షకులను రీచ్‌ అయ్యిందో అదే స్థాయిలో ‘నేనేరాజు నేనేమంత్రి’ చిత్రంలో రానా పోషించిన జోగేంద్ర పాత్ర కూడా అంతటి ప్రేక్షకాధరణ పొందుతుందనే విశ్వాసంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లు జోగేంద్రపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈతరం రాజకీయ నాయకుడిగా రానా ఈ చిత్రంలో కనిపిస్తాడని అనిపిస్తుంది. రానా బాడీలాంగ్వేజ్‌ మరియు నటన అచ్చు యువ రాజకీయ నాయకుడి మాదిరిగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా రానా కెరీర్‌లో ‘బాహుబలి’ స్థాయిలో నిలిచి పోవడం ఖాయం అని, ఈ చిత్రం తర్వాత రానాను ఎక్కువగా జోగేంద్ర అంటూ పిలుస్తారని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ నటించింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

జాతీయ పతాక రూపశిల్పి జయంతి స్పెషల్ …

బిగ్‌బాస్‌లో రచ్చరచ్చ..

‘రానా’ జోగేంద్ర జోగేంద్ర సాంగ్ టీజర్ అదరహో …