మూడు స్తంభాల్ని ఒకటి చేసిన పవన్

pawan mixed BJP,TDP, YCP, together in viza tour

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీలో పవన్ ఫ్యాక్టర్ రోజురోజుకీ క్రేజ్ తెచ్చుకుంటోంది. దశాబ్దాలుగా అందరూ నిర్లక్ష్యం చేసిన ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి పవన్ తీసుకున్న చర్యలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏకంగా వాల్డ్ బెస్ట్ హార్వర్డ్ ప్రొఫెసర్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు పవన్ తీసుకున్న చొరవ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను కదలిస్తోంది. అటు నల్గొండ వాసులు కూడా తమ ఫ్లోరైడ్ సమస్యకూ పరిష్కారం కనుగొనాలని పవన్ ను కలవాలనే ఆలోచనతో ఉన్నారట.

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ క్రేజీ హీరోనే. సినిమాల్లో పవర్ స్టార్ గా ఉన్న పవన్.. రాజకీయాల్లో జనసేనానిగా దుమ్ము దులుపుతున్నారు. పవన్ ఎక్కడకు వెళ్లినా ఆయన్ను అన్ని పార్టీల నేతలు కలుస్తున్నారు. కానీ విశాఖ టూర్ లో మాత్రం అరుదైన దృశ్యం కనిపించింది. బద్ధశత్రువులు కూడా పవన్ తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. టీడీపీ, బీజేపీతో పాటు వైసీపీ నేతలు కూడా పవన్ తో కలిసి పోజివ్వడం చర్చనీయాంశమైంది.

తెలుగువారి ప్రయోజనాల కోసం పవన్ కావాలనుకుంటే అన్ని పార్టీలను ఒక్కతాటిపైకి తేగలడని ఇప్పుడు స్పష్టమైంది. ఈ గ్రూప్ ఫోటోను హోదాపై పోరాటానికి అన్వయిస్తే మంచి ఫలితాలు వస్తాయని జనసేన భావిస్తోంది. అందుకే ముందస్తుగా అందరితో మంచి సంబంధాలు పెట్టుకుని.. తర్వాత గోదాలోకి దిగి పోరు ఉధృతం చేయాలని భావిస్తోంది. పవన్ ప్లాన్ సూపరంటున్నారు అభిమానులు.

మరిన్ని వార్తలు:

పవన్ కు ముద్రగడ లేఖ… బాబు వలలో పడొద్దని హెచ్చరిక

అనంతలో రైతు డాన్స్ వేస్తే … వైరల్ వీడియో

ఇండియాకే అమెరికా రెడ్ కార్పెట్