అధికారం వచ్చినా.. బుద్ధి మారలేదు

amith-shah-fires-on-bjp-mps

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కుక్కతోక ఎప్పుడూ వంకరేనని సామెత ఉంది. ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా అలాగే చేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంటులో గలాటా చేసి గంటకే బయటికొచ్చే అలవాటు చేసుకున్న ఎంపీలు.. ఇప్పుడు పాత అలవాటు మానలేకపోతున్నారు. అందుకే పార్లమెంటులో అతి కష్టం మీద లంచ్ బ్రేక్ వరకూ ఉన్నామనిపించి ఆ తర్వాత జెండా ఎత్తేస్తున్నారు. దీంతో కీలక సమయాల్లో కేంద్రానికి ఇబ్బంది అవుతోంది.

ముఖ్యంగా రాజ్యసభలో మైనార్టీలో ఉన్న ప్రభుత్వానికి ప్రతి ఓటు కీలకమే. ఇది తెలిసి కూడా ఎంపీలు నాన్ సీరియస్ గా ఉంటున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి విప్ జారీ చేసినా.. ముప్ఫై మంది ఎంపీలు సభ ఎగ్గొట్టారు. అదేమంటే కుంటిసాకులు చెప్పారు. దీంతో అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారట. మిమ్మల్ని ఎంపీలుగా ఎంపిక చేసింది సభలో కూర్చోడానికే కానీ.. తిరగడానికి కాదని క్లాస్ పీకారు.

గతంలో మోడీ కూడా పార్లమెంటుకు గైర్హాజరు కావద్దని ఎంపీలకు గట్టిగా చెప్పారు. అయినా సరే ఎంపీలు మాత్రం తమకు తోచినట్లు చేస్తున్నారు. ఎంపీల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, వారే తప్పులు తెలుసుకుంటారా అనేది మాత్రం ప్రశఅనార్థకంగానే ఉంది. ఎప్పుడు ఏమౌతుందో తెలియని పరిస్థితుల్లో రాజ్యసభలో ఎంపీలు తప్పనిసరిగా హాజరయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని మంత్రులకు కూడా షా క్లాస్ పీకారు.

మరిన్ని వార్తలు:

వెంకయ్యకు సిసలైన వారసుడు

జాతీయ పతాక రూపశిల్పి జయంతి స్పెషల్ …

టీడీపీకి కాంగ్రెస్ అధ్యక్షుడా..?