బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన బింధుమాధవి

bindu madhavi wild-card entry in Bigg Boss Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మొన్నే కదా దీక్షాపంథ్‌ బిగ్‌బాస్‌ షోలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిందని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటి అంటే బింధు మాధవి బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ ఇచ్చిన మాట వాస్తవమే కాని, తెలుగు బిగ్‌బాస్‌ షోలో కాదు, తమిళంలో కమల్‌ హోస్టింగ్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ షోలో. హిందీలో సూపర్‌ సక్సెస్‌ అయిన బిగ్‌బాస్‌ షోను తెలుగులో మరియు తమిళంలో కూడా ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో విజయ్‌ టీవీలో, తెలుగులో స్టార్‌ మాటీవీలో ఈ బిగ్‌బాస్‌ షో ప్రసారం అవుతుంది. షోకు అదనపు ఆకర్షణ చేర్చి, ప్రేక్షకుల ఆధరాభిమానాలను పొందేందుకు ఇలా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు జరుగుతున్నాయి. 

తెలుగులో దీక్షా పంత్‌ను పంపించిన బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు బింధు మాధవిని షోలో వైల్డ్‌ కార్డ్‌ ద్వారా లోనికి పంపించడం జరిగింది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో జాయిన్‌ అయిన బింధు మాధవికి తమిళనాట మంచి గుర్తింపు ఉంది. దాంతో ఖచ్చితంగా ఆమె బిగ్‌బాస్‌ షోకు అదనపు ఆకర్షణ అవుతుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన బింధు మాధవి ఆ తర్వాత తమిళం మరియు మలయాళ సినిమాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. తమిళనాట ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. దాంతో ఈమెను బిగ్‌బాస్‌ షోకు ఎంపిక చేయడం జరిగింది. మద్యలో జాయిన్‌ అయిన బింధు మాధవి లక్కీగా ఫైనల్‌ వరకు నిలుస్తుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

రానా కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’

బిగ్‌బాస్‌లో రచ్చరచ్చ..

మంచి మనస్సున్న జ్యోతి