మంచి మనస్సున్న జ్యోతి

Bigg Boss Contestant Jyothi Helps Allari Subhashini For Cancer Treatment

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బిగ్‌బాస్‌ షో నుండి మొదటి వారంలోనే నటి జ్యోతి ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. మొదటి వారంలోనే జ్యోతి ఎలిమినేట్‌ అవ్వడంపై ఆమె తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేసింది. తాను ఇంకా గేమ్‌లో కొనసాగి ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చింది. అయితే జ్యోతిని ప్రేక్షకులు తిరష్కరించడం జరిగింది. అయినా జ్యోతి ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మళ్లీ తన సాదారణ జీవితాన్ని స్టార్ట్‌ చేసింది. మొదటి వారంలోనే జ్యోతి ఎలిమినేషన్‌ అయినప్పటికి స్టార్‌ మాటీవీ వారు ఆమెను నిరుత్సాహ పర్చకుండా మంచి పారితోషికంను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం కంటే దాదాపు డబుల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో సంతోషంగా జ్యోతి తనవంతు సాయంను అల్లరి సుభాషినికి చేయడం జరిగింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అల్లరి సుభాషిని క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమె చికిత్స కోసం మళ్లీ సినిమాలు చేయాలని భావిస్తుంది. కాని సినిమాల్లో ఆఫర్లు రావడం లేదు. అయినా కూడా ఆమె తన ప్రయత్నంను మానేయడం లేదు. ఇలాంటి సమయంలో సుభాషినికి జ్యోతి తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. సుభాషినికి దాదాపు లక్ష రూపాయల సాయంను జ్యోతి ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయిన జ్యోతి తనకు వచ్చినదాంట్లోనే సుభాషినికి సాయం చేసి ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది. జ్యోతిది మంచి మనస్సు అని, ఆమెను బిగ్‌బాస్‌ షోలో అపార్ధం చేసుకున్నామని కొందరు ఇప్పుడు బాధపడుతున్నారు.

మరిన్ని వార్తలు:

ఎట్టకేలకు స్పందించిన మంచు లక్ష్మి

సాయి పల్లవి ఎంత ఎదిగి పోయింది..!