ఎన్టీఆర్‌ గెస్ట్‌గా బిగ్‌బాస్‌ 2 ??

JR NTR Guest in Bigg Boss Telugu Season 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భారీ అంచనాల నడుమ బుల్లి తెరపై ఈనెల 10న ప్రారంభం కాబోతున్న ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2కు రంగం సిద్దం అయ్యింది. ఇప్పటికే పార్టిసిపెంట్లను ఎంపిక చేయడం జరిగింది. ఈసారి సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండవ సీజన్‌ను నానితో నిర్వహించేందుకు స్టార్‌ మా ప్రయత్నాలు పూర్తి చేసింది. షోను భారీ ఎత్తున ప్రారంభించేందుకు స్టార్‌ ఇండియా ప్లాన్‌ చేసింది. అందుకోసం ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా తీసుకు రావాలని భావించింది. ఎన్టీఆర్‌తో పలువురు మాటీవీ సంబంధీకులు చర్చించి ఆయన్ను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ మంచి పేరు తీసుకు వచ్చాడు. దాంతో పాటు టీఆర్పీ మరియు డబ్బులు కూడా దక్కాయి. అందుకే ఈ రెండవ సీజన్‌ కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. అయితే కాస్త మంచి ఓపెనింగ్‌ ఉండాలని మాత్రం భావిస్తున్నారు. ఈనెల 10న ప్రారంభం కాబోతున్న ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 ప్రారంభోత్సవ వేడుకలో ఎన్టీఆర్‌ పాల్గొనేందుకు ఓకే చెప్పాడు. ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించి, నాని ఈ షోను కంటిన్యూ చేయబోతున్నాడు. బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభోత్సవంకు హాజరు కాబోతున్నందుకు భారీగానే పారితోషికం అందుకోబోతున్నాడు అంటూ కొందరు అంటున్నారు. మరి ఈ షో సక్సెస్‌కు ఎన్టీఆర్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఏ మేరకు ఉపయోగ పడుతుందనేది చూడాలి.