మోడీ షా లను సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంది…కానీ !

Gujarat Former DIG Vanjara talks about modi and amit shah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

ప్రస్తుతం భారత్ ప్రధానిగా వ్యవరిస్తున్న మోడీ, భాజపా అద్యక్ష్యుడిగా వ్యవహరిస్తున్న అమిత్ షా లు అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రులుగా ఉన్నప్పుడు వారిని అరెస్టు చేయాలని సీబీఐ అనుకుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో గుజరాత్ మాజీ డీఐజీ వంజారా పలు కీలక అంశాలను వెల్లడించారు. అప్పటిలో మోడీ షా లను అరెస్ట్ చేయాలని సీబీఐ అనుకుందని అయితే, అదృష్టం బాగుండి ఇద్దరూ తప్పించుకున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో వంజారా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, సరైన సాక్షాధారాలను చూపించడంలో సీబీఐ విఫలమయిందంటూ మోదీ, అమిత్ షాలకు 2014లో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ హత్యకు కుట్ర జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఇష్రాత్ జహాన్ తో పాటు ఆమె స్నేహితులు జావెద్ అలియాస్ ప్రాణేశ్, పాకిస్థాన్ కు చెందిన జీహాన్ జొహార్, అంజాద్ రాణా అనే యువకులను ఒక టెర్రరిస్ట్ టీమ్ గా పోలీసులు అనుమానించారు. దీంతో, అప్పటి డీఐజీ వంజారా నేతృత్వంలో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేసి చంపారు. అయితే, వారు టెర్రరిస్టులు కాదనే విషయం తదుపరి విధించిన సీబీఐ విచారణలో తేలింది. వంజారా కుట్రపూరితంగా వారిని చంపారని సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి నుండి ఈ కేసు నడుస్తూనే ఉంది.