రామోజీతో కన్నా భేటీ…ఆ రాయభారం కోసమేనా ?

Lakshminarayana Meets Ramoji Rao Because Rajamouli Clashes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కన్నా లక్ష్మీనారాయణ కలిశారు. అయితే మొన్నటి దాకా అయితే ఆ విషయం వేరేలా ఉండేది కానీ ఇప్పుడు కన్నా ఒక జాతీయ పార్టీకి ప్రాంతీయ అధ్యక్షుడు అయ్యాక ఇప్పుడు సదరు భేటీకి అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. మార్కెట్ లో నంబర్ వన్ దిన పత్రిక, టీవీ చానెల్ అధినేతగా ఉన్న రామోజీ తెలుగుదేశం పార్టీకి అధినేతకు రాజగురువులాంటి వాడు అని కొన్ని మీడియా వర్గాలు అంటూ ఉంటాయి. రామోజీ రావుకు ఓ పెద్ద పత్రిక ఉంది. ఆ పత్రిక ఏది రాస్తే అది నిజమని నమ్మే జనం ఉన్నారంటే అతిసయోక్తికాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూనే బీజేపీని కాస్త వెనుకేసుకు వచ్చింది 2014లో. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు హోదా విషయంలో విభేదించి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగామాట్లాడడం మొదలు పెట్టారు. ఆ పార్టీని ఏ వేదిక పై నుంచి అయినా తూర్పారబడుతున్నారు. ఒకరకంగా ఈనాడు కూడా బాబు సర్కార్ కే కాస్త వెన్నుదన్నుగా వార్తలు రాస్తూ వస్తోంది. ఇలాంటి స్థితిలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రామోజీ రావు కలిశారు. అందుకే ఈ భేటీ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. వారు మా మధ్యన రాజకీయాలేమీ చర్చకు రాలేదు అని అన్నా అంటారు కానీ ఇప్పటికే ఈ విషయం రాజాకీయ వర్గాల్లో కీలక చర్చలకి దారి తీస్తోంది.

ఎందుకంటే ఎయిర్ ఏషియా ఉదంతంలో చంద్రబాబు పేరు బైటకు రావడం, బిజెపిపై టిడిపి నేతలు అడ్డూ అదుపూ లేకుండా విమర్శల నేపథ్యంలో ఏదో అతి ముఖ్యమైన విషయం చర్చించేందుకే ఈ ఇద్దరూ సమావేశం అయినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం ఒకటి త్వరలో వెలుగులోకి రాబోతోందంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన ప్రకటన ఇప్పుడు వీరి కలయికకూ ఏమన్నా సంభందం ఉందా అనే అనుమానాలని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లోనే ఆ కుంభకోణం అన్ని ఆధారాలతో దాన్ని బయటపెట్టనున్నట్లు వెల్లడించిన కుటుంబరావు ఆ స్కామ్ వెల్లడితో ఖచ్చితంగా దడపుట్టిస్తామని ఏపీ బిజెపి నేతలకు హెచ్చరికలు కూడా చెసారు ఇప్పటివరకు మాటల యుద్దానికే పరిమితమైన టిడిపి-బిజెపి ఇకపై చేతల్లో తమ సత్తా చాటడానికి ప్రయత్నించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే రామోజీకి కేంద్రంతో ఉన్న సంభందాల దృష్ట్యా ఏమయినా రాయభారం కోసం కన్నా వెళ్లి ఉంటారా అనే అనుమానాల్ని సైతం ఇప్పుడు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.