మహేష్‌ లుక్‌ కేకో కేక.. ఛిఛీ..!

mahesh babu new look revealed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన 25వ సినిమాకు సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడు. దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. విభిన్న కథాంశంతో దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్‌బాబు గడ్డం మరియు మీసాలతో కనిపించబోతున్నాడు. చాలా విభిన్నంగా ఈ చిత్రంలో మహేష్‌ను చూపించాలని భావిస్తున్న దర్శకుడు ఇలా ఆయన కొత్త లుక్‌ను తయారు చేశాడు. త్వరలోనే సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్న నేపథ్యంలో మహేష్‌బాబు కొత్త లుక్‌ రివీల్‌ అయ్యింది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మహేష్‌ ఇలా గడ్డంతో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

మహేష్‌బాబు గడ్డం లుక్‌ సూపర్‌ అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు. 25వ సినిమా అన్నప్పుడు ఇలాంటి ప్రత్యేకతలు ఉండాలని, ఇలా ఉంటేనే గుర్తుండి పోతుందని మహేష్‌బాబు అభిమానులు కొందరు అంటున్నారు. అయితే కొందరు యాంటీ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ మాత్రం ఆయన గడ్డం లుక్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. మహేష్‌బాబు రకరకాలుగా పోల్చుతూ, మహేష్‌ను ఛిఛీ అంటూ చిత్కరిస్తున్నారు. మహేష్‌బాబును గడ్డంతో వెండి తెరపై చూడలేమని, ఆయన్ను ఎప్పటిలాగే చూపించడం దర్శకుడికి మంచిది అంటూ హెచ్చరించాడు. భారీ ఎత్తున సినిమాను ప్లాన్‌ చేస్తున్న దర్శకుడు ఎట్టి పరిస్థితుల్లో మహేష్‌బాబును గడ్డంతోనే చూపించాలని నిర్ణయించుకున్నాడు. మహేష్‌బాబు కూడా వైవిధ్యం కోసం గడ్డం పెంచాడు. గడ్డం లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మహేష్‌ గడ్డం లుక్‌ను మీరు చూడవచ్చు.