అర్ధ‌రాత్రి బైక్‌లో వెళ్ళి సాయం చేసిన స్టార్ హీరో

tamil Hero Vijay visits Tuticorin police firing victims

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకునే ఈరోజుల్లో, తమిళ స్టార్ హీరో తాను రహస్యంగా చేసిన సాయం ఇతరులెవ్వరికీ తెలియకుండా ఉండేలా చేసారు. ఇటీవల తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. తమ ఆరోగ్యాల్ని… పర్యావరణాన్ని దెబ్బ తీస్తుందంటూ ఆందోళన చేస్తున్న తూత్తుకూడి ప్రజానీకం మీద పోలీసులు అమానుషంగా కాల్పులు జరపటం… పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన వైనం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో బాధితుల్ని పరామర్శించేందుకు ఎందరో ప్రముఖులు వచ్చారు. వారంతా బాధితుల చేతుల్లో ఊహించని రీతిలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపధ్యంలో తూత్తుకూడి బాధితుల్ని పరామర్శించేందుకు ఒక స్టార్ హీరో ఊహించని రీతిలో పరామర్శలు చేసి.. అక్కడి వారి మనసుల్ని దోచుకున్నారు.మంగళవారం రాత్రి వేళ బైక్ మీద తూత్తుకూడికి వచ్చిన విజయ్.. నేరుగా బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. వారిని పరామర్శిస్తూ.. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయాన్ని అందించారు. ఎక్కడా కూడా తాను వస్తున్నట్లుగా సమాచారం ఇవ్వలేదు. ఎంత గుట్టుగా వచ్చారో.. అంతే గుట్టుగా బైక్ మీద చెన్నై వెళ్లిపోయారు. విజయ్‌ అక్కడకు వచ్చిన సందర్భంగా కొందరు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు తీశారు. విజయ్ చేసిన సాయం తీరును పలువురు అభినందిస్తున్నారు.రీల్ హీరో కాదు రియల్ హీరో అంటూ మెచ్చుకుంటున్నారు. విజయ్‌ అక్కడకు వచ్చిన సందర్భంగా కొందరు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు తీశారు. వాటి ద్వారానే విజయ్ ఆ ప్రాంతాన్ని రహస్యంగా సందర్శించారాణి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది.