చరణ్‌తో ‘స్పైడర్‌’..!

murugadoss-to-direct-ram-charan-upcoming-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Murugadoss To Direct Ram Charan Upcoming Movie

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ ప్రస్తుతం తెలుగు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా ‘స్పైడర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆ సినిమాను దసరాకు విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే తమిళంలో విజయ్‌తో మురుగదాస్‌ ఒక చిత్రాన్ని చేయనున్నాడు. ఇంత బిజీగా ఉన్న మురుగదాస్‌ తెలుగులో వచ్చే సంవత్సరం మరో సినిమాను చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఠాగూర్‌ మధుకు మురుగదాస్‌కు వ్యాపార భాగస్వామ్యం ఉంది. దాంతో ఠాగూర్‌ మధు వచ్చే సంవత్సరం మెగా మూవీని మురుగదాస్‌తో చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

రామ్‌ చరణ్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘స్పైడర్‌’ చిత్రం ఫలితం ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా రామ్‌చరణ్‌ ఒక చిత్రాన్ని మురుగదాస్‌ దర్శకత్వంలో చేయాలని కోరుకుంటున్నాడు. అందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మురుగదాస్‌ అధికారికంగా ఓకే చెప్పలేదు. కాని చరణ్‌తో మురుగదాస్‌ మూవీ ఉండటం మాత్రం ఖాయం అని మెగా వర్గాల వారు అంటున్నారు. ఠాగూర్‌ మధు ముందుంటే చరణ్‌తో మురుగదాస్‌ సినిమా తెరకెక్కడం చాలా సులువే అంటూ వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరంలో వీరి కాంబో మూవీ ప్రారంభం అయ్యి, ఆ తర్వాత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

ఇది నాని స్టైల్‌… షాకింగ్‌ స్టెప్‌