రుణం తీర్చుకోబోతున్న మాస్‌రాజా

mass maha raja ravi teja next film with sreenu vaitla

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఒక కారణంగా ఆయన శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన సినిమాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. దాంతో రవితేజ కెరీర్‌ గాడిలో పడ్డట్లయ్యింది. ప్రస్తుతం రవితేజ వెను దిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. వరుసగా పెద్ద సినిమాలను చేస్తున్నాడు. అయితే శ్రీనువైట్ల మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాడు. వరుసగా ఫ్లాప్‌లు రావడంతో చాలా దారుణమైన పరిస్థితిని శ్రీనువైట్ల ఎదుర్కొంటున్న విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. 

శ్రీనువైట్లతో ఉన్న సన్నిహిత్యం కారణంగా రవితేజ ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాపై ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా ఫ్లాప్‌ అయినా పర్వాలేదు అనే ఉద్దేశ్యంతో పారితోషికం కూడా తక్కువ తీసుకుని, ఒక చిన్న బడ్జెట్‌ చిత్రంలో రవితేజ నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం రెండు చిత్రాలను చేస్తున్న రవితేజ ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో  నటించేందుకు ఓకే చెప్పాడు. తనకు లైఫ్‌ను ఇచ్చిన దర్శకుడు అవ్వడంతో అడిగిన వెంటనే కాదనలేక రవితేజ ఓకే చెప్పాడని, ప్రస్తుతం రవితేజ కోసం శ్రీనువైట్ల స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాడని సమాచారం అందుతుంది. సినిమా ఇండస్ట్రీలో రుణం తీర్చుకోవాలని భావిస్తే మొదటికే మోసం వస్తుంది. గతంలో పలు సంఘటనలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అందుకే రవితేజ సాహసం చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.