ఇది నాని స్టైల్‌… షాకింగ్‌ స్టెప్‌

nani to do new movie in samuthirakani direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యువ హీరో నాని వరుస చిత్రాలతో సక్సెస్‌లను అందుకుంటున్నాడు. గత రెండు సంవత్సరాలుగా మినిమం గ్యారెంటీ చిత్రాలను చేస్తూ నాని ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ‘నేను లోకల్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని త్వరలోనే ‘నిన్ను కోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వరుసగా రెండు చిత్రాలను నాని కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి తమిళ దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వంలో చేయబోతున్నాడు. 

తమిళంలో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్న దర్శకుడు సముద్రఖని, తెలుగులో నాని హీరోగా అప్పుడు ‘జెండాపై కపిరాజు’ అనే చిత్రాన్ని చేశాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. తెలుగులో వాయిదాల మీద వాయిదాలు పడి విడుదలైన ఆ సినిమాను ప్రేక్షకులు ఆధరించలేదు. కాని విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే నాని ద్విపాత్రాభినయం చేసినందుకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మళ్లీ ఆయన దర్శకత్వంలో నాని సినిమాను చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాడు. తమిళంలో మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకునేందుకు నాని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే సముద్ర ఖని దర్శకత్వంలో ద్వి భాష చిత్రాన్ని చేయడం ద్వారా తమిళ ఆడియన్స్‌కు దగ్గర కావచ్చు అనేది నాని ప్లాన్‌గా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు 

వర్మకు ఓకే చెప్పిన నాగ్‌.. త్వరలో షూటింగ్‌

రామాయణంపై పడ్డ వర్మ

బన్నీ, బాలయ్యలను చూసి నేర్చుకోండయ్యా