బన్నీ, బాలయ్యలను చూసి నేర్చుకోండయ్యా

Allu Arjun And Balakrishna Are Doing Movies As Back To Back

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Allu Arjun And Balakrishna Are Doing Movies As Back To Back

టాలీవుడ్‌లో పది పదిహేను సంవత్సరాల ముందు వరకు కూడా హీరోలు ఒకదాని వెంట ఒకటి, ఒక సినిమా చేస్తున్న సమయంలోనే మరోటి చేస్తూ వచ్చారు. అందుకే అప్పటి హీరోలు వందల సంఖ్యలో సినిమాలు చేశారు. కాని ఇప్పుడు హీరోలు మాత్రం 25 సంఖ్య చేరారు అంటే గొప్పగా చెప్పుకుంటున్నారు. సంవత్సరానికి ఒకటి చొప్పున మాత్రమే కొందరు స్టార్‌ హీరోలు సినిమాలు చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్‌, బాలకృష్ణలు మాత్రం వరుసగా సినిమా వెంట సినిమా బ్యాక్‌ టు బ్యాక్‌ అన్నట్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

ఈ సంక్రాంతికి బాలయ్యది ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల కావడం జరిగింది. ఆ సినిమా విడుదలైన వెంటనే పూరి దర్శకత్వంలో ‘పైసా వసూల్‌’ను చేస్తున్నాడు. దసరాకు ఆ సినిమా విడుదల కానుంది. పూరితో సినిమా పూర్తి కాకుండానే ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక బన్నీ కూడా చాలా స్పీడ్‌గా ఉన్నాడు. ‘సరైనోడు’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్నా కూడా ‘డీజే’ చిత్రాన్ని తక్కువ సమయంలోనే చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘డీజే’ చిత్రం విడుదలకు ముందే ‘నా పేరు సూర్య’ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. వచ్చే వేసవిలోనే ఆ సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. మొత్తానికి వీరిద్దరు బ్యాక్‌ టు బ్యాక్‌ సంవత్సరంకు రెండు మూడు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇలా మూడు కాకున్నా కనీసం రెండు అయినా ఇతర హీరోలు చేయాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

బన్నీ అరుదైన రికార్డ్‌.. ఈయనే నెం.1

బాలయ్య సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యేనా?